యువతతోనే దేశాభివృద్ధి
కర్నూలు సిటీ: యువత దేశ సంపద అని, దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు చేయాలని సినీ నటుడు సుమన్ అన్నారు. శనివారం క్లస్టర్ యూనివర్సిటీ యువ తరంగ్–2024 ఇంటర్ కాలేజీ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, గురువులను మరచిపోకూడదని, అందరి జీవితంలో వారి పాత్ర కీలకమైందన్నారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ సమాజంలో సమస్యలు లేని వ్యక్తి అంటూ ఉండడని, వాటిని ఎదుర్కొని విజయం సాధించినప్పుడే మన శక్తి ఏమిటో నిరూపితం అవుతుందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్సిటీకి 12బీ గుర్తింపు, న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రభుత్వ సహకారంతో సాధిస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన మొదటి స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, సిల్వర్‌జూబ్లీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు డాక్టర్ వీవీఎస్ కుమార్, డాక్టర్ ఇందిరాశాంతి ప్రసంగించారు. క్లస్టర్ యూనివర్సిటీపై రచయిత యలపర్తి రమణయ్య పాట రచించి సభలో పాడారు. ఆ తరువాత క్రీడా పోటీల్లో గెలుపొందిన అధ్యాపకులు, విద్యార్థులకు బహూమతులు ప్రదానం చేశారు.
క్లస్టర్ యూనివర్సిటీ యువ తరంగ్
వేడుకల్లో సినీ నటుడు సుమన్
Comments
Please login to add a commentAdd a comment