జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎస్పీ బిందు మాధవ్
కర్నూలు: మరింత ప్రతిభ కనపరచి అంతర్జాతీయలో రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించాలని ఎస్పీ బిందు మాధవ్ క్రీడాకారులను అభినందించారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కరాటే అండర్–17 (66 కిలోల విభాగం) పోటీల్లో కర్నూలు సీసీఎస్ విభాగం హెడ్ కానిస్టేబుల్ వాసు కుమారుడు మన్నెపు వెంకటదినేష్ స్వర్ణం సాధించాడు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన కె.హవీష్ పి.హేమంత్ కుమార్‌రెడ్డి, సాయి అక్షిత, రుషికేష్, యస్మితలు వెండి, కాంస్య పతకాలు సాధించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ వారిని అభినందించారు. జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి స్వర్ణ పతకం సాధించడం గర్వకారణమని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, మూడో పట్టణ సీఐ శేషయ్య, ఆర్‌ఐ నారాయణ, కోచ్ జగదీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment