ఆత్మకూరురూరల్: సిద్దాపురం గ్రామానికి చెందిన వణ్యప్రాణి వేటగాళ్లు దుప్పిని వధించి మాంసాన్ని ఆత్మకూరులో విక్రయించేందుకు బైక్‌పై వస్తున్నారని సమాచారం అందడంతో గురువారం స్థానిక ముష్టపల్లె రహదారి మలుపు వద్ద డివిజన్ యాంటీ పోచింగ్ (వన్యప్రాణి వేట నివారణ దళం) స్క్వాడ్ సిబ్బంది గస్తీ చేపట్టారు. అటవీ సిబ్బందిని గమనించిన దుండగులు బైక్ వేగం పెంచి పక్కనున్న మరో మార్గంలోకి వాహనం మళ్లించారు. అప్రమత్తమైన సిబ్బంది తమ వాహనంతో వెంబడించగా వేగంగా వెళుతున్న దుండగుల బైక్ ఆ మార్గంలో వెళుతున్న బాలుడిని ఢీకొట్టింది. ఆ బాలుడికి గాయాలయ్యాయి. అయినా దుండగులు వేగం తగ్గించకుండా చేతిలోని మూటను కిందకు వదలి అటవీ సిబ్బంది కనుచూపునుంచి మాయమైపోయారు. దుండగులు వదలి వేసిన మూటలో 40 కేజీల దుప్పి మాంసాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది గాయపడిన బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పీఓఆర్ తయారు చేసి నిందితులుగా అనుమానిస్తున్న వారి కోసం గాలింపు చేపట్టారు.
తప్పించుకున్న వన్యప్రాణి వేటగాళ్లు
సినీ ఫక్కీలో ఛేజింగ్
పారిపోతూ బాలుడిని ఢీకొట్టిన
వేటగాళ్ల బైక్
Comments
Please login to add a commentAdd a comment