క్రీడాకారులకు అభినందన
కర్నూలు(సెంట్రల్): ఇటీవల ఢిల్లీలో జరిగిన 68వ జాతీయ కరాటే అండర్–17 బాలుర విభాగంలో జిల్లాకు చెందిన క్రీడాకారులు వెంకటశ్రీ, దినేష్, స్వర్ణ పతకాలు, అండర్–14 విభాగంలో కంచి హవీష్, హేమంత్‌కుమార్‌రెడ్డి, బాలికల విభాగంలో కరిమెట్ల యశ్మిత, గోపగ్న వెండి పతకాలు సాధించారు. వీరిని కలెక్టర్ ఉపాధ్యాయుల సమావేశంలో అభినందించి భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఈఓ శామ్యూల్‌పాల్, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మీ, డీసీఓ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణం పాల్గొన్నారు.
ట్రైనీ డీఎస్పీ, సీఐ విచారణ
ఆస్పరి: మండలంలోని ముత్తుకూరు గ్రామంలో హనుమంతు అనే వ్యక్తి ఈనెల 17వ తేదీన మతిస్థిమితం లేని మహిళను ఇంట్లో నిర్భంధించి అత్యాచారం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గురువారం ముత్తుకూరు గ్రామంలోని ఘటనా స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐ మస్తాన్ వలి సందర్శించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment