స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
కర్నూలు(సెంట్రల్): ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రూ.3,580 కోట్ల ఫీజురీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పు మొత్తాలను విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజును చెల్లించకపోవడంతో అన్యాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఫీజురీయంబర్స్‌మెంట్ బకాయలు రూ.2,100 కోట్లు, స్కాలర్‌షిపులకు సంబంధించి రూ.1,480 కోట్ల బకాయిలు ఉండడంతో విద్యార్థులను కాలేజీలు రానిచ్చుకోవడం లేదని, పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో జీఓ 77ను రద్దు చేస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదన్నారు. అలాగే హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించి మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలను 8 నెలలుగా పెండింగ్‌లో ఉంచారని, ఫలితంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ ఫీజురీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అభి, అశోక్, విజయ్,ఈశ్వర్, చరణ్, చింటు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment