అధికారులకు చుక్కెదురు
● పైప్‌లైన్ పనులను అడ్డుకున్న కాలనీ మహిళలు
బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీలో నగర పంచాయతీ అధికారులకు శుక్రవారం చుక్కెదురైంది. కాలనీలోని బోరు బావి నుంచి నూతన మినరల్ వాటర్ ప్లాంట్‌కు పైపు లైన్ ఏర్పాటు చేసేందుకు యత్నించగా కాలనీ మహిళలు అడ్డుకున్నారు. ఎన్నికల ముందు కోట్ల కుటుంబం బైటిపేట కాలనీకి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన అధికారులు బోరు వేయకుండా స్థానికంగా ఉన్న బోరుకే పైప్‌లైన్ ఏర్పాటు చేసుకుందుకు పూనుకోగా తమకు నీటి సమస్య తలెత్తుతుందని కాలనీవాసులు అడ్డుకున్నారు. నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్, సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ రమేష్‌బాబు, టీడీపీ నాయకులు బుగ్గన ప్రసన్నలక్ష్మి, ఆనంద్ రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పైపు లైన్ పనులను అడ్డుకోవద్దని కోరినా మహిళలు ససేమిరా అన్నారు. బోరు బావి నుంచి మినరల్ వాటర్ ప్లాంట్‌కు కనెక్షన్ ఇస్తే మళ్లీ తాగునీటి సమస్య తలెత్తితే ఎవర్ని అడగాలని కాలనీ మహిళలు శాంతకుమారి, స్రవంతి, సులోచ న, నాగలక్ష్మిదేవి, వెంకటలక్షమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పోలీసుల సహకారంతో అధికారులు పైపు లైన్ ఏర్పాటు చేశా రు. ఈవిషయంపై నగర పంచాయతీ కమిష నర్ హరిప్రసాద్‌ను వివరణ కోరగా మినరల్ వాటర్ ప్లాంట్‌కు కాలనీలోని బోరు బావి నుంచి పైపు లైన్ ఏర్పాటు చేశామన్నారు. కాలనీ వాసులు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికి కనెక్షన్ ఇవ్వలేదన్నారు. వారంతా చర్చించుకున్నాక నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment