సంతలో పొట్టేళ్లు అ‘ధర’హో!
కోసిగి: గ్రామీణ ప్రాంతాల్లో దేవరలు జరుగుతుండటంతో పొట్టేళ్లకు డింమాడ్ ఏర్పడింది. మండలంలోని నేడు వందగల్లు, గౌడుగల్లు, జుమ్మాలదిన్నె, దుద్ది, కొల్మాన్‌పేట, సాతనూరు, అగసనూరు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బాపుల దొడ్డి గ్రామాల్లో గ్రామ దేవతల మారెమ్మ దేవర ఉత్సవాలు జరుగనున్నాయి. అలాగే జనవరి 6, 7వ తేదీలో నిర్వహించే కోసిగి దేవరకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ పొట్టేళ్ల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. దీంతో చుట్టూ పక్కల ఎక్కడ సంత జరిగినా పొట్టేళ్లు అధిక ధర పలుకుతున్నాయి. మంగళవారం మండల కేంద్రం కోసిగిలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో గొర్రె పొట్టేల వారపు సంత మార్కెట్ వ్యాపారస్తులు, ప్రజలతో కిక్కిరిసి పోయింది. ఒక్కో పొట్టేలు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట ఆమనిగడ్డ ప్రాంతాల నుంచి పొట్టేలను సంత మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పందెం పొట్టేళ్లు కూడా సంతకు రావడంతో అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల మూడు పొటేళ్లు రూ. లక్షకు పైగా ధర పలకడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment