● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్ర స్ధాయి అమలులోకొరవడిన పర్యవేక్షణ ● వెనుకబడిన విద్యార్థులపై లోపించిన ప్రత్యేక దృష్టి ● కేజీబీవీల్లో పత్తాలేని పంచతంత్ర.. ఆదర్శ పాఠశాలల్లో అడిగే దిక్కేలేదు ● జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగా ప్రత్యేక తరగత | - | Sakshi
Sakshi News home page

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్ర స్ధాయి అమలులోకొరవడిన పర్యవేక్షణ ● వెనుకబడిన విద్యార్థులపై లోపించిన ప్రత్యేక దృష్టి ● కేజీబీవీల్లో పత్తాలేని పంచతంత్ర.. ఆదర్శ పాఠశాలల్లో అడిగే దిక్కేలేదు ● జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగా ప్రత్యేక తరగత

Published Wed, Dec 25 2024 1:56 AM | Last Updated on Wed, Dec 25 2024 1:56 AM

● పదో

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్

కర్నూలు నగరానికి 15 కి.మీ. దూరంలో ఉన్న పూడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. పది విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ఈ నెల 3వ తేదీన ప్రణాళికను విడుదల చేసింది. కానీ ఇక్కడ అసలు తరగతులే ప్రారంభం కాలేదంటే ఉన్నత పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థమవుతోంది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పర్యవేక్షణ ఇక దేవుడెరుగు.

మండల కేంద్రం హొళగుంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొత్తం 1,850 మంది వి ద్యార్థులు చదువుతున్నారు. 10వ తరగతిలో ఇంగ్లిషు మీడియంలో 216 మంది, కన్నడ మీడియంలో 55, ఉర్దూ మీడియంలో 11 మంది మొత్తం 282 విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 56 మంది టీచర్లు పని చేయాల్సి ఉండగా, కేవలం 38 మందే ప్రస్తుతం ఉన్నారు. తెలుగు సబ్జెక్టుకు ఏడుగురు గాను నలుగురు, హిందీకి ముగ్గురు టీచర్లకు ఇద్దరు ఉండగా, వీరిలో ఒకరు సెలవుల్లో ఉన్నారు. ఉర్దూ టీచర్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయాలాజికల్‌ సైన్స్‌ టీచర్లే లేరు. దీంతో కొన్ని సబ్జెక్టులలో సిలబస్‌ ఇంకా పూర్తి కాలేదు.

ప్రారంభం కాని వర్చువల్‌ ల్యాబ్‌

వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వర్చువల్‌ ల్యాబ్‌ నుంచి తరగతులు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ముందుగా డీఈఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో నగరంలోని సంకల్‌బాగ్‌ మున్సిపల్‌ పాఠశాలను పరిశీలించారు. చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయంటూ చెబుతూనే రోజులు గడుపుతున్నారు. వెనుకబడిన విద్యార్థులు కనీస పాస్‌ మార్కులతోనైన ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన స్టడీ మెటిరియల్‌, ప్రశ్నపత్రాల నమూనాలను ఇప్పటి వరకు అందించ లేదు.

జిల్లాలో ఉన్నత పాఠశాలలు – 507

పదో తరగతి విద్యార్థులు – 38,448

ఏ – కేటగిరిలో – 8,295

బీ – కేటగిరిలో – 10,646

సీ – కేటగిరిలో – 8,645

డీ – కేటగిరిలో – 5,398

కర్నూలు సిటీ: విద్యార్థి జీవితంలో పదో తరగతి మొదటి మెట్టు. ఉన్నత విద్య వైపు అడుగులు వేయాలంటే ఇక్కడ తప్పనిసరిగా గట్టెక్కాల్సిందే. ఈ నేపథ్యంలో అధికారులు పదో తరగతి ఉత్తీర్ణతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. 2025 మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ జారీ చేసింది. ఈ క్రమంలో పది పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇటీవలే విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక గంట అదనంగా ప్రత్యేక తరగతులు, రోజుకొక సబ్జెక్టు ప్రకారం రివిజన్‌, విద్యార్థులకు స్లిప్‌ టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ జిల్లాలో చాలా చోట్ల ప్రత్యేక తరగతులు నిర్వహించడం లేదు. డీఈఓ రెగ్యులర్‌గా విద్యాశాఖకు సంబంధించిన సమీక్షలు, కాన్ఫరెన్స్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇక డిప్యూటీ డీఈఓలు మాత్రం ఎక్కడ పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లకు చెందిన 38,448 మంది విద్యార్థులు ఫార్మటివ్‌ 1,2 (ఎఫ్‌ఏ), సమ్మెటివ్‌ (ఎస్‌ఏ) అసెస్మెంట్‌ పరీక్షలు రాశారు. ఆ పరీక్షల ఫలితాలను బట్టి చదువులో వెనుకబడిన విద్యార్థులను నాలుగు కేటగిరిలుగా విభజించారు. ఏ– క్యాటగిరిలో 8295, బీ – క్యాటగిరిలో 10,646, సీ – కేటగిరిలో 8,645, డీ– కేటగిరిలో 5,398 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కువ శాతం మంది గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టుల్లోనే ఫెయిల్‌ అవుతున్నారు. ఆయా సబ్జెక్టులలో టీచర్ల కొరత అధికంగా ఉండటమే ఇందుక కారణం. ఆయా సబ్జెక్టు టీచర్లతో సీ, డీ కేటగిరిలకు చెందిన విద్యార్థులపై ఎక్కడ కూడా ప్రత్యేక దృష్టి సారించలేదు.

సిలబస్‌ ఇంకా మిగిలే ఉంది..

ఈ విద్యా సంవత్సరంలో మొదటిసారి పదో తరగతి విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో పరీక్షలు రాయనున్నారు. గత ప్రభుత్వం జిల్లాలో 90 స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులో ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ సిలబస్‌ను రద్దు చేయడంతో ఆ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు కొంత గందరగోళానికి గురయ్యారు. ఈ నెల 15వ తేదీలోపు అన్ని సబ్జెక్టుల సిలబస్‌ పూర్తి కావాలి. కానీ ఇంత వరకు సిలబస్‌ పూర్తి కాలేదు. కానీ ఎంత సిలబస్‌ పూర్తి చేశారు..ఇంకెంత కావాల్సి ఉంది అనే విషయంపై సమీక్షించే వారే కరువయ్యారు. ఏపీ మోడల్‌ స్కూళ్లలో అయితే ఏమి జరుగుతుందో అడిగే దిక్కు లేకుండా పోయింది. ఆ స్కూళ్ల పర్యవేక్షణను గాలికి వదిలేశారు. గతంలో ఆ స్కూళ్ల పర్యవేక్షణకు ఏడీ ఉండేవారు. అయితే ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అదే విధంగా కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో పది ఫలితాల పెంపునకు గతేడాది నుంచి పంచతంత్ర అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదు. స్థానికంగానే ఉండాల్సిన ఎస్‌ఓలు సాయంత్రానికే ఇళ్లకు బయలుదేరుతున్నారు. కనీసం ఇప్పటికై న జిల్లా విద్యాశాఖ అధికారులు మేల్కోకపోతే ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ప్రణాళికను పకడ్బందీగా

అమలు చేస్తాం

పదిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళిక తయారు చేసి అన్ని హైస్కూళ్లలో అమలు చేసేలా ఇటీవలే కలెక్టర్‌ రంజిత్‌ బాషా ప్రధానోపాధ్యాయులకు చాలా విలువై న సూచనలు చేశారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి టీచర్ల కొరత ఉన్న చోట డిజిటల్‌ ల్యాబ్‌ ద్వారా బోధనకు ఏర్పాటు చేశాం. పరీక్షలు ముగిసే వరకు కచ్చితంగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం.

– ఎస్‌.శామ్యూల్‌ పాల్‌, డీఈఓ

వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత

పశ్చిమ ప్రాంతానికి చెందిన హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్లర్లను నియమించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు చాలా రోజులుగా కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఇంత వరకు ఆవైపుగా ఆలోచనలు చేయలేదు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 854 సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. గత ప్రభుత్వం జిల్లాలో 1,876 సబ్జెక్టు టీచర్లను భర్తీ చేసింది. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. మెగా డీఎస్సీ నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసింది. దీనికి తోడు పశ్చిమ పల్లెల్లో వలసలు పోవడంతో చాలా మంది స్కూళ్లకు హాజరుకావడం లేదు. తల్లిదండ్రులతో పాటు పిల్లలు వెళ్లకుండా విద్యాశాఖ ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువ మంది పదో తరగతి పిల్లలు వలసలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్1
1/4

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్2
2/4

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్3
3/4

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్4
4/4

● పదో తరగతి ఫలితాల పెంపునకు వంద రోజుల ప్రణాళిక ● క్షేత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement