కరెంట్ చార్జీల బాదుడుపై పోరాటం
● పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆరునెలల్లో రెండు సార్లు విద్యుత్ చార్జీల పెంపు ● ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: ‘ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు భారీగా ప్రజలపై విద్యుత్ భారం వేస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగుతోంద’ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కాటసాని కల్లూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. దీనిపై ఈ నెల 27న పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ప్రజలతో కలసి విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతి పత్ర మిస్తామన్నారు. కూటమి పాలనలో విద్యుత్ భారం ఎక్కువైందన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయడం లేదని మండిపడ్డారు.
15వేల కోట్ల ప్రజలపై భారం
ఆరు నెలల్లో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల ప్రజలపై రూ. 15వేల కోట్లు భారం పడుతుందని కాటసాని అన్నారు. ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చె ప్పారన్నారు. అంతేకాకుండా సోలార్, విండ్ పవర్ తీసుకువచ్చి వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకపోగా రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరోమాట చెబుతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబే చార్జీలు భారీగా పెంచుకుంటూపోతున్నారని చెప్పారు. నాడు అసత్య ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు కరెంట్ బాదుడుపై నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం కరెంట్‌చార్జీల పెంపుపై ఈనెల 27న వైఎస్సార్‌సీపీ పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీశ్రేనులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన్ కార్పొరేటర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment