హక్కులను సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు సిటీ: వినియోగదారులు తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని..ఇందుకోసం ఓ చట్టం ఉందని జాయింట్ కలెక్టర్ డా.బి నవ్య పేర్కొన్నారు. మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ పాల్గొని ప్రసంగించారు. 1986 సంవత్సరంలో మొదటగా వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. రోడ్లపై ఆకర్షణీయంగా కనిపించే ఆహారపదార్థాలు తినడం ద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని , వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డీవీఆర్ సాయిగోపాల్, వినియోగదారుల సంఘం సభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల చట్టం గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజారఘవీర్, సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా.వి.వి.ఎస్ కుమార్, జిల్లాపౌర సరఫరాల శాఖ డీఎం సంధ్యారాణి, ఆర్టీఓ లాల్ సింగ్ చౌహాన్, ఫూడ్ సెఫ్టీ అధికారి రాజగోపాల్, ఎల్‌డీఎం రామచంద్రారావు, మున్సిపల్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వరరెడ్డి, ఔషధ నియంత్రణ అధికారి రమాదేవి, వినియోగదారుల సంఘం కార్యదర్శి శివ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment