కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లపై మార్కెటింగ్ శాఖ దృష్టి సారించింది. జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మంత్రాలయం మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో మూడింటికి రిజర్వేషన్ కల్పించనున్నారు. మూడింటిలో ఒకటి ఎస్సీలకు, రెండు బీసీలకు కేటాయిస్తారు. రెంటింటిలో ఒకటి బీసీ జనరల్, మరొకటి మైనార్టీలకు నిర్ణయించారు. ఓసీలకు 4 మార్కెట్ కమిటీలకు కేటాయించారు. ఇందులో 2 మహిళలకు, మరో రెండు జనరల్ చేయనున్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన ఫైల్‌ను మార్కెటింగ్ శాఖ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్‌కు పంపింది. మంత్రి ఆమోదం పొందిన తర్వాత ఫైల్‌ను జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వివరాలను ప్రకటించడం జరుగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment