గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
బేతంచెర్ల: ప్రతి ఒక్క క్రీడాకారుడు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలని ఎంజేపీ డిప్యూటీ సెక్రటరీ సుభాషిని దేవమ్మ, జిల్లా కన్వీనర్ ఫ్లోరమ్మ, ఎంఈఓ సోమశేఖర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గోరుమానుకొండ ఎంజేపీ ఏపీ రెసిడెన్సియల్ స్కూల్, కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులుగౌడు ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, కడప జిల్లా జోనల్ స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జోనల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఆటల పోటీల్లో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. క్రీడా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం కబడ్డీ, ఖోఖో హ్యాండ్‌బాల్, వాలీబాల్, చెస్, టెన్నికాయిట్, షటిల్ పోటీలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment