షాద్‌నగర్‌లో చోరీ చేసి.. డోన్‌లో వదిలేసి!
● ఇంట్లో నగదు, నగలు లేకపోవడంతో కారును చోరీ చేసిన దుండగుడు ● టోల్ ప్లాజ్ వద్ద ఫాస్ట్‌ట్యాగ్ మెసేజ్‌తో యజమాని అప్రమత్తం
డోన్ టౌన్: ఓ దొంగ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు అంతా గాలించినా ఏమీ దొరకలేదు. చివరికి టేబుల్‌పై కారు తాళాలు కనిపించాయి. వాటితో కారును తీసుకుని కర్నూలు వైపు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటపడే సరికి డోన్ వరకు వచ్చి ఫ్రైఓవర్ బ్రిడ్జి కింద వదిలేసి పరారయ్యాడు. తెలంగాణ సీసీఎస్ పోలీసు మమ్మద్‌జాకీర్ తెలిపిన వివరాలు.. ఈనెల 25న గుర్తుతెలియని దుండగుడు షాద్‌నగర్‌లోని ఓ ఇంటిలోకి చొరబడ్డాడు. ఆభరణలు, డబ్బు ఏమీ దొరక్కపోవడంతో టేబుల్‌పై ఉన్న తాళాలు తీసుకుని బయట పార్కు చేసి ఉంచిన కియా కంపెనీ కారు ఖీ 07 ఏో 3456 నంబరు కారుతో కర్నూలు వైపు బయలుదేరాడు. టోల్ గేట్ క్రాస్ చేసిన సమయంలో పాస్ట్ ట్యాగ్ నుంచి డబ్బు కట్ అయ్యినట్లు యజమాని సెల్‌కు మెసేజ్ వెళ్లడంతో ఆయన అప్రమత్తమైన తన సెల్ ఫోన్‌లో ఇంటి సీసీ కెమెరా పరిశీలించి కారు చోరీ అయినట్లు గుర్తించి షాద్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే ముందున్న టోల్ ప్లాజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి కారును ఆపాలని ఆదేశించారు. మరో టోల్ ప్లాజా సిబ్బంది కారును ఆపే ప్రయత్నం చేస్తుండగా దొంగ కారును రెండవ టోల్ ప్లాజాలోకి వెళ్లకుండా ఒక్కసారిగా వెనక్కి వెళ్లి పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. జీపీఎస్ ఆధారంగా డోన్ ప్‌లైవర్ బ్రిడ్జి కింద పార్కు చేసి ఉంచినట్లు శుక్రవారం గుర్తించారు. తెలంగాణా సీసీఎస్ పోలీసులు డోన్‌కు చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో నంద్యాల జిల్లా క్లూస్ టీంను రప్పించి దుండగుల వేలి ముద్రలు సేకరించుకున్న అనంతరం కారును షాద్ నగర్‌కు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment