పగిడ్యాల: తూర్పు ప్రాతకోట గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొల్ల స్వాములు భార్య లక్ష్మీదేవి(36) కొంత కాలంగా థైరాయిడ్, మానసిక రోగంతో బాధపడుతోంది. పలు డాక్టర్లను చూపించినా జబ్బు నయం కాకపోవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. శనివారం ఉదయం భర్త పొలానికి వెళ్లగా ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. పొలం నుంచి తిరిగి వచ్చిన స్వాములు..ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను కిందికి దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మృతురాలి అక్క అలివేలు తన చెల్లెలిని కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ముచ్చుమర్రి ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment