పదవులు అలంకార ప్రాయం కాకూడదు..
పార్టీ కోసం పనిచేసే వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని జగనన్న నిర్ణయించారని, పదవులు అలంకార ప్రాయంగా కాకూడదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. ఈ పదవులు ఎవరిపై పెత్తనం ఉండకూడదని, ప్రజలకు అండగా ఉందామన్నారు. మరోసారి జగనన్నను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఇప్పటి నుంచే పని చేద్దామని పిలుపు నిచ్చారు. ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టిస్తే వారి పేర్లను గుర్తు పెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. పోస్టు కోసం ఫీల్డ్ అసిస్టెంట్‌ను హత్య చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారారని విమర్శించారు. హామీలు అమలు చేయకుంటే కాలర్ పట్టుకోవాలన్న నారా లోకేష్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తిరుపతి తొక్కిసలాట బాధితుల పరామర్శకు జగనన్న రాకుండా పవన్ కళ్యాణ్, ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. అయినా ప్రజాభిమానం ఉన్న నాయకుడు జగన్ అక్కడికి వెళ్లి వారిని పరామర్శించారన్నారు.
కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఎనిమిది నెలల్లోనే నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఈనెల 5వ తేదీ కర్నూలులో చేపడుతున్న వైఎస్సార్‌సీపీ ఫీజు పోరును విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment