విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
పత్తికొండ రూరల్: విద్యార్థి దశ నుంచే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా అన్నారు. పత్తికొండలోని కస్తూర్బా గాంధీ, అంబేడ్కర్ గురుకుల బాలికల గురుకుల పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కస్తూర్బా పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో వసతుల గురించి స్పెషల్ ఆఫీసర్ షబానాను అడిగి తెలుసుకున్నారు. పది విద్యార్థులకు సిలబస్ పూర్తయిందా లేదా అన్న వివరాలు తెలుసుకున్నారు. ఏమైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసు కోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల చేరుకుని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా ఉడకలేదని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, ఆర్డీఓ భరత్‌నాయక్, తహసీల్దారు రమేష్, ఎంపీడీఓ సువర్ణలత ఉన్నారు.
కలెక్టర్ రంజిత్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment