ప్రముఖ రంగస్థల నటుడు బీసీ కృష్ణ మృతి
● బిల్వ మంగళ పాత్రలో వేలాది ప్రదర్శనలు
కర్నూలు కల్చరల్: ప్రముఖ రంగస్థల నటుడు బీసీ కృష్ణ (78) మృతి చెందారు. చాలా రోజులు గా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిడ్నీలు ఫెయిల్ కావడంతో శనివారం సాయంత్రం మరణించారు. చింతామణి నాట కంలో బిల్వమంగళుడుగా వేల నాటకాలు ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. బిల్వమంగళుడు పాత్ర అంటే బీసీ కృష్ణ తప్పా మరొకరు అంత అద్భుతంగా ప్రదర్శించలేరనే విధంగా నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ హోర్మోనిస్టు కేసీ శివారెడ్డి ముఖ్య శిష్యునిగా ఉంటూ 30 సంవత్సరాలు రంగ స్థల నాటకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందారు. అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ చేత సత్కారం పొందారు. తెలుగు యూనివర్సిటీ నుంచి సత్కారం అందుకున్నారు. కందుకూరి పురస్కారం పొందారు. ఆయన మృతి రంగస్థలానికి తీరని లోటని పలువులు కళాకారులు, కళా సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు. కేసీ శివారెడ్డి రూపొందించిన ఒక ఆణిముత్యం బీసీ కృష్ణ అని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక నాయకులు బైలుప్పల షఫి, హనుమాన్ కళా సంస్థ అధ్యక్షులు హనుమంతరావు చౌదరి, కవి, రచయిత పార్వతయ్య, తదితరులు బీసీ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment