బొమ్మలసత్రం: పాతగొడవల కారణంగా హరి అనే యువకుడిని మరో యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. అవుట్ పోస్ట్ పోలీసుల సమాచారం మేరకు.. రోజకుంట వీధికి చెందిన హరి పట్టణంలో రోజువారి పనికి వెళ్తాడు. ఇతనికి నందమూరినగర్ వీధికి చెందిన గౌస్‌తో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈక్రమంలో శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గౌస్ కత్తితో హరిపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవటంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాత స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈమేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment