కర్నూలు: కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానెల్ అధినేత పాల్లూరి రమణను మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈయన అయ్యప్పస్వామి గుడి సమీపంలోని బీకే సింగ్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటాడు. జిల్లా మంత్రి టీజీ భరత్, ఆయన తండ్రి, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్‌పై వార్తలు (అనుచిత వ్యాఖ్యలు) పోస్టు చేశాడనే కారణంపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి, ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆకెపోగు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున పోలీసులు యూట్యూబర్ రమణ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment