కోడుమూరు రూరల్: వెల్దుర్తి మండలంలోని ఎల్.బండ గ్రామ సమీపంలో శనివారం తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక మద్యాన్ని రవాణా చేస్తున్న కారు పట్టుబడినట్లు కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన కర్ణ గౌడ, అహమ్మద్ హుసేన్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.95 వేలు విలువ చేసే కర్ణాటకకు చెందిన 2400 విస్కీ టెట్రా పాకేట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారును సీజ్ చేసినట్లు సీఐ వివరించారు.
529 మంది గైర్హాజరు
కర్నూలు కల్చరల్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నైతిక మానవీయ విలువలు పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని 162 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మొత్తం 23, 262 మందికి 22,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 529 మంది గైర్హాజౖరైనట్లు ఆర్‌ఐఓ ఎస్‌వీఎస్ గురువయ్య శెట్టి పేర్కొన్నారు. పలు పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. బోర్డు నియమ నిబంధనల మేరకు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం మండలాల్లో ప్రత్యేక తనిఖీ బృందాల ద్వారా తనిఖీ చేయించామన్నారు. స్పెషల్ ఆఫీసర్ జి.లాలెప్ప, డీఈసీ సభ్యులు కె.నాగభూషణ రెడ్డి, యు. పద్మావతి, జి.ఎస్.సురేష్ చంద్ర, డి. మల్లికార్జున వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment