ఆదోని మార్కెట్ యార్డులో గోదాముల స్వాధీనం
ఆదోని అర్బన్: బాడుగ చెల్లించకపోవడంతో ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మూడు గోదాములను పోలీసు, రెవెన్యూశాఖల అధికారుల సమక్షంలో శనివారం యార్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఖాదర్‌వలి కంపెనీ గోదాము నంబర్ 329, అహ్మద్ వలి గోదాము నంబర్ 328, ఆదిత్య ట్రేడింగ్ కంపెనీ గోదాము నంబర్ 255 ఉంది. ఈ సందర్భంగా యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బాడుగ చెల్లించని గోదాములు 59 ఉన్నాయని, రూ.30 లక్షల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగిలిన 56 మంది స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె శివార్లలోని ప్రధాన రహదారిలో శనివారం బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును మినీ లారీ ఎదురై ఢీ కొంది. బస్సు తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వాహనంలో ఇరుక్కు పోవడంతో స్థానికులు బయటకు లాగారు. బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఫాస్టాగ్‌లో నగదు లేక నిలిచిన ఆర్టీసీ బస్సులు
ఓర్వకల్లు: ఫాస్టాగ్ అకౌంట్‌లో నగదు లేకపోవడ ంతో శనివారం నన్నూరు టోల్‌ప్లాజా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నంద్యాల డిపో కు చెందిన ఏపీ 39 యూహెచ్ 9000, ఏపీ 39 యూజీ 8000 నెంబర్ గల ఆర్టీసీ బస్సులు నంద్యాల నుంచి కర్నూలుకు బయలుదేరాయి. మా ర్గమధ్యలో జాతీయ రహదారిపై ఉన్న నన్నూరు టోల్‌ప్లాజా వద్ద సంబంధిత బస్సులకు ఫాస్టాగ్ లో నగదు లేకపోవడంతో టోల్ సిబ్బంది నిలిపివేశారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్లు టోల్ సిబ్బందితో వా దనకు దిగారు. తీరా చేసేదేమిలేక నగదు చెల్లించ డంతో బస్సులు ముందుకు కదిలాయి. సుమారు అర గంట సేపు వాగ్వాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment