● శిఖరం.. ‘శిశిర’ సోయగం
ప్రస్తుతం శిశిర రుతువు నడుస్తోంది. మాఘమాసంలో పలు వేడుకలు సాగుతున్నాయి. శనివారం రాత్రి వేళ కర్నూలు నగరంలోని వినాయక్ ఘట్ వద్ద సుందర దృశ్యం కనిపించింది. కేసీ కెనాల్ పక్కన ఉన్న గణేశుని ఆలయం శిఖరంపై నక్షత్రం దే దీప్యమానంగా వెలిగింది. శిఖరం పక్కనే చంద్రుని సౌరభం ఆకట్టుకుంది. క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణ కాలంలో ఈ సుందరం ప్రజల్లో సరికొత్త ఆధ్యాత్మిక భావాన్ని నింపింది.
– డి.హుస్సేన్,
సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment