జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతాం
● శాప్ చైర్మన్ రవి నాయుడు
కర్నూలు (టౌన్): వెనుకబడిన కర్నూలు జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. శనివారం ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి శాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియాన్ని పరిశీలించారు. అస్తవ్యస్తంగా ఉన్న స్టేడియం నిర్వహణ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోర్ స్టేడియంలో టాయెలెట్ల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. పారిశుధ్య నిర్వహణలో డీఎస్ డీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చు కోవాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్నూలులో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేసి కర్నూలు స్టేడియాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఫుట్‌బాల్ పశ్చిమ మైదానం, అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్, వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేయాలని క్రీడా సంఘాల ప్రతినిధులు రామాంజనేయులు, హర్షవర్ధన్, వెంకటేష్, నాగరత్నమయ్య, చిన్న సుంకన్న, సురేంద్ర, స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్యలు విన్నవించారు. అనంతరం శాప్ చైర్మన్‌ను పలు క్రీడా సంఘాలు సత్కరించాయి.
Comments
Please login to add a commentAdd a comment