![వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09knl14-200015_mr-1739131250-0.jpg.webp?itok=PEATsqEj)
వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకించాలి
కర్నూలు(సెంట్రల్): కేరళ తరహాలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.సుభాన్, కమిటీ సభ్యులు పి.ఇక్బాల్‌హుస్సేన్, ఎస్‌ఎండీ షరీఫ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆవాజ్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలపై అభాండాలు వేస్తూ మోసపూరిత పాలన సాగిస్తోందన్నారు. వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టేందుకే సవరణ చట్టం తెస్తోందన్నారు. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఏపీలోని టీడీపీ, జనసేన పార్టీలు కూడా వ్యతిరేకించాలని, లేదంటే ప్రజలే ఆ పార్టీల నాయకులకు గుణపాఠం చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment