![స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపుతున్న ఎకై ్సజ్ పోలీసులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/30/29hmkd77-330093_mr_0.jpg.webp?itok=oUiwrwiD)
స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపుతున్న ఎకై ్సజ్ పోలీసులు
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా రైలులో తరలిస్తున్న 7 కిలోల శుద్ధి చేసిన ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ చంద్ర మోహన్ తెలిపారు. కాజీపేట పట్టణ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన వివరాలు వెల్ల డించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో పోలీసులను చూసిన నిందితులు పరారీ కాగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలో మత్తు పదార్ధాల విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే 8712659020 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. సమావేశంలో ఎస్సై తిరుపతి, సిబ్బంది ఖలీల్, రవీందర్, లాలయ్య, వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment