గుట్టపై కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే తదితరులు
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై సోమవారం నిర్వహించిన దేవతమూర్తుల కల్యాణోత్సవంతో జాతర సందడి మొదలైంది. హోలీ పండుగను పురస్కరించుకొని ఆనవాయితీ మేరకు కడవెండి గ్రామంలో మందాడి వెంకట్‌రెడ్డి ఇంటి నుంచి పూజలు చేసిన తలంబ్రాలు హనుమాన్ ఆలయం వరకు తీసుకువచ్చారు. అక్కడ పూజారి సంపత్‌కుమారాచార్యుల పర్యవేక్షణలో ట్రాక్టర్‌లో ఏర్పాటు చేసిన మగ్గంపై చేనేత కార్మికులు, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి నూతన వస్త్రాలు నేస్తూ.. గుట్టపైకి చేరుకున్నారు. కళాకారుల కోలాటం, డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపు సాగింది. అనంతరం గుట్టపై కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే జాతర నాటికి ఆలయ అభివృద్ధిలో మిగులు పనులు పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం ఎర్రంరెడ్డి నర్సింహారెడ్డి(ఇంద్రసేనారెడ్డి) ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పెద్ది రమేష్‌గౌడ్, తలంబ్రాల శాశ్వత ప్రతినిధి మందాటి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, పద్మశాలి సంఘం నాయకులు నల్ల శ్రీరాములు, కౌడగాని సోమనర్సోజీ, మహేందర్‌జీ, యాకన్న, మల్లయ్య ముదిరాజ్, జీడీ ఎల్లయ్య, నల్ల ఉపేందర్, గుడెల్లి శ్రీను, భాషిపాక అంజయ్య, ఎంపీటీటీసీ దుబ్బాక కవిత రత్నాకర్‌రెడ్డి, లీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో దేవరుప్పుల, కొడకండ్ల ఎస్సైలు చెన్నకేశవులు, శ్రవణ్‌కుమార్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా లక్ష్మీనర్సింహ్మస్వామి కల్యాణోత్సవం
తలంబ్రాలు సమర్పించిన
ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment