లగచర్ల బాధితులకు న్యాయం జరగాలి
మహబూబాబాద్: లగచర్ల బాధితులకు న్యాయం జరగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథో డ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. లగచర్ల ఘటనకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని, బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామన్నారు. లగచర్ల గిరిజన రైతులను ఇబ్బందిపెట్టి 28 మందిని అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను మొలక అని సీఎం మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్ర ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ ఈనెల 21న స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ క విత మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడారు. మానుకోట మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బిందు, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, రావుల రవిచందర్‌రెడ్డి, రవికుమార్, యాళ్ల మురళీధర్‌రెడ్డి, ఎడ్ల వేణుమాధవ్, కన్నా, జె. వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్
Comments
Please login to add a commentAdd a comment