నవోదయలో ప్రవేశాలకు మరో అవకాశం..
ఖిలా వరంగల్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ మామునూరులో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాట చేసింది. ఇందులో ఏటా 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తూ ప్రవేశాలు స్వీకరిస్తోంది. అయితే ప్రస్తుతం 2025–26 సంవత్సరానికి సంబంధించి 9,11వ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఖిలా వరంగల్ మండలం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ ఉండాలి. 11వ తరగతిలో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారే దరఖాస్తు చేసుకోవాలి. 9వ తరగతిలో ప్రవేశాలకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 1, 2010 నుంచి జూలై 31, 2012 మధ్య జన్మించిన వారు, 11వ తరగతిలో ప్రవేశాలకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జాన్ 1, 2008 నుంచి జూలై 31, 2010 మధ్య జన్మించి ఉండాలని ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు నవంబర్ 26వ తేదీలోపు httpr:IIcbreitmr.nic.in2024nvrix వెబ్ సైట్, లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 08, 2025న జరగనుంది.
9,11వ తరగతుల్లో ఖాళీలు
ఈనెల 26వ తేదీలోపు
దరఖాస్తులకు ఆహ్వానం
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
నవోదయలో ప్రవేశాల కోసం విద్యార్థులకు మరో అవకాశం కల్పించాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రణాళికాప్రకారం పరీక్షకు సన్నద్ధమై ఉత్తీర్ణత సాధించాలి.
– బి.పూర్ణిమ, నవోదయ ప్రిన్సిపాల్ , మామునూరు
Comments
Please login to add a commentAdd a comment