లక్నవరం.. పర్యాటకుల స్వర్గధామం
గోవిందరావుపేట : లక్నవరం.. పర్యాటకుల స్వర్గధామమని, రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామం లక్నవరం జలాశయంలో రూ. 7 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సా రథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉండడంతోపాటు దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారక్క జాతర ములుగు జిల్లాకు గుర్తింపు తెచ్చిపెడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలను సుందరంగా తీర్చిదిద్దుతామని, పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తామన్నారు. ఐలాండ్ అనుభూతి పొందేందుకు అండమాన్, మాల్దీవులు లాంటి సుందర ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో కూడా అలాంటి టూరిజం స్పాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కనుచూపు మేర నీరు.. చుట్టూ పచ్చని కొండల మధ్యలో 12 దీవులతో ప్రకృతి అందాలను కలబోసుకున్న లక్నవరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కుమార్ కేంద్రం ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటా యించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో పర్యాటక ప్రాంతాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటా యించాలని కోరుతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్ పాల్గొన్నారు.
అందుబాటులోకి మూడో ద్వీపం
రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా
తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రులు జూపల్లి కృష్ణారావు,
ధనసరి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment