అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే తరిమికొడతారు
హన్మకొండ చౌరస్తా: ‘ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రూ. వేల కోట్ల నిధులు మంజూ రు చేస్తే ఏం తెచ్చారని కొందరు అజ్ఞానులు అడుగుతున్నారు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ద్రో హులను ప్రజలే తరిమికొట్టే రోజులొస్తాయి’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయోత్సవసభతో ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్త రూపం దాల్చబోతుందన్నారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులుంటే రూ.200 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు టెండర్లను పిలిస్తే కమీషన్లకు కక్కుర్తి పడే నాయకుల తీరుతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదన్నారు. అది మరిచిన కొందరు మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చదువుకున్న అజ్ఞాని అన్నారు. జీఓలను చదివే కనీస జ్ఞానం లేదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ జీవిత కాలంలో తీసుకురాలేనన్ని నిధులు ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం నోటిఫికేషన్లతో సరిపెడితే కాంగ్రెస్ సర్కారు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించిందన్నారు. నాడు సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ప్రకారం ఎయిర్‌పోర్టు భూసేకరణ, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు. పదేళ్లు భూకబ్జాలతో నగరాన్ని భ్రష్టుపట్టించిన దొంగలు నేడు మాట్లాడడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీసీ వరంగల్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారా యణ, విజయశ్రీరజాలి, నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కూచన రవళి పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాకు వేల కోట్ల నిధులు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment