మహబూబాబాద్: జిల్లా కేంద్రం శివారులోని కేటీఆర్ కాలనీలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య ఆధ్వర్యంలో కాలనీవాసులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ.. ప్రధానంగా రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ సమీపంలో ఉన్న భూములు చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయని, ఆవిషయంలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు రాధ సుధారాణి, ఉపేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment