మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: గిరిజన జిల్లా మానుకోట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలం చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసి రాజకీయ లబ్ధి పొందిందన్నారు. గ్రామ ప్రజల పోరాట ఫలితంగా మండల ప్రకటన చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో అభివృద్ధి జరగలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించి అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్నారు. అదేవిధంగా గూడూరు మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం సోషల్ వెల్ఫేర్ గురుకుల ఫార్మసీ కళాశాలలో అతిథి అధ్యాపకుల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి 2024–25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సి పాల్ స్వప్నరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్మస్యూటిక్స్–1, ఫార్మకాలజీ–1, ఫార్మాకెమిస్ట్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, సర్వీస్ సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటల వరకు ఫార్మసీ కళాశాలలో కార్యాలయంలో అందజేయాలన్నారు.
విద్యార్థుల సామర్థ్యాలను
పరీక్షించిన డీఈఓ
కొత్తగూడ: విద్యార్థుల చదువు సామర్థ్యాలను డీఈఓ రవీందర్‌రెడ్డి పరీక్షించారు. మండలంలోని పొగుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, పోలారంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో వందశాతం హాజరైన విద్యార్థులను అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల్లో ప్రతిభను మెరుగు పరచడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సబ్జెక్టుల్లో పూర్తయిన సిలబస్ తెలుసుకుని విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. ఆయన వెంట ఎంఈఓ లక్ష్మీనా రాయణ,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి ష్ణువర్దన్‌రావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జంతువులను
వేటాడటం నేరం: ఎఫ్‌ఎస్‌ఓ
వాజేడు: అడవి జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరమని ఎఫ్‌ఎస్‌ఓ మల్ల నాగమణి అన్నారు. మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి, కోయవీరాపురం గ్రామాల్లో విడివిడిగా ప్రజలకు మంగళవారం అవగాహన కార్యక్రమాలను అటవీశాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి ఏడ్జర్లపల్లిలో మాట్లాడుతూ.. అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు అంటుకుంటే అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. అడవికి ఇప్ప పువ్వులు ఏరడానికి వెళ్లినప్పుడు చెట్ల కింద కూర్చున్న వారు పొరపాటున కూడా నిప్పు పెట్టవద్దని సూచించారు. అడవి జంతువులను ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి హతమారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌ఎస్‌ఓ వెంట అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment