ఏఎస్పీ చెన్నయ్యకు ఆత్మీయ వీడ్కోలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీ అయిన నేపథ్యంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు మంగళవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎర్రతివాచీ పరిచి బ్యాండ్ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఏఎస్పీ చెన్నయ్య కు పూలమాలలు వేసి, పూలు చల్లుతూ ఊరేగింపు చేశారు. చెన్నయ్య ఎస్పీగా పదోన్నతి పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. కాగా ఆయన మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీగా 2022 జనవరి 2న విధుల్లో చేరి రెండు సంవత్సరాల పదకొండు నెలలకుపైగా జిల్లాలో సేవలు అందించారు. ఈ నెల 31న తన పదవీ విరమణ ఉండగా ఎస్పీగా పదోన్నతి పొందినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెన్నయ్య ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment