రాష్ట్రంలో అవినీతి పాలన
తొర్రూరు రూరల్: రాష్ట్రంలో ఏడాదికాలంగా అవినీతి, అక్రమాలు, తప్పుడు కేసులు, బెదిరింపులతో పాలన సాగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పాపం త్వరలోనే పండుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాయమాటలు, తప్పుడు ప్రచారాలతో అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు. హామీలపై ప్రశ్ని స్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు అన్నివర్గాల ప్రజలపై తప్పుడు కేసులు పెడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ గ్రంథాన్ని తమ అగ్రనేత రాహుల్‌గాంధీ చేతిలో పట్టుకొని తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి ఆరాచక పాలన సాగిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులు, బెదిరింపులను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, రైతులు, ప్రజలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అక్రమంగా లగచర్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి, జైలులో ఉన్న రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జెడ్పీఫ్లోర్‌లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, ముఖ్య నాయకులు శామకూరి ఐలయ్య, నలమాస ప్రమోద్, రాయిశెట్టి వెంకన్న, మాచర్ల వెంకన్న, జనార్దన్‌రాజు, కుమారస్వామి, లింగన్నగౌడ్ పాల్గొన్నారు.
తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment