జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. సింగిల్ డి
దైనందిన జీవితంలో
అర్ధరాత్రి తప్పని తిప్పలు
● ఎముకలు కొరికే చలిలో ఉపాధి బాట
● వారు పనిచేస్తేనే ప్రజా జీవనం పరుగులు
● పాలు, కూరగాయలు, కోళ్లు,
ధాన్యం దిగుమతి
● తెల్లవారుజామున కార్మికుల
పారిశుద్ధ్య పనులు
● రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో
ప్రయాణికుల పాట్లు
● చలి తీవ్రత నేపథ్యంలో ‘సాక్షి’ విజిట్
●
12:45గంటలకు ఆస్పత్రికి..
● రాత్రి 12:45 గంటలకు జిల్లా ఆస్పత్రి వద్ద రోగుల అటెండర్లు పోర్టుకో కింద దుప్పట్లు కప్పుకొని పడుకొని కనిపించారు.
ముందుగానే దుకాణాలు బంద్..
● మహబూబాబాద్ పట్టణంలో ప్రతీరోజు రాత్రి 10గంటల తర్వాత కూడా రోడ్లపై కనిపించే చిరు వ్యాపారులు, హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు సోమవారం మాత్రం చలి తీవ్రత కారణంగా ముందస్తుగానే తమ వ్యాపారాలను ముగించుకుని వెళ్లిపోయారు. దీంతో పలు కూడళ్లు నిర్మానుష్యమయ్యాయి.
రాత్రి 12గంటలకు
చికెన్ షాపుల్లో కోళ్ల దిగుమతి..
● జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంతం నుంచి మూడుకొట్ల సెంటర్ వరకు ఉన్న చికెన్ షాపుల్లో ఖమ్మం నుంచి కోళ్ల వ్యాన్లు వచ్చి కోళ్లను దిగుమతి చేశాయి. కోళ్లను దిగుమతి చేస్తున్న సుమన్‌ను పలకరించగా.. చలి తీవ్రత ఉన్నప్పటికీ వ్యాపారస్తులకు కోళ్ల సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం వేళ ట్రాఫిక్ సమస్య ఉంటుందని, అందుకు రాత్రి వేళల్లోనే అన్ని షాపులకు కోళ్లను సరఫరా చేస్తామని తెలిపాడు.
1.45గంటలకు మాటాముచ్చట
● రాత్రి 1.45గంటలకు ప్రైవేట్ షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డును పలకరించాం. ఆసయమంలో అతడు తలకు మప్లర్, దుప్పటి కప్పుకున్నప్పటికీ చలికి వణుకుతూ మాట్లాడాడు.
1.15గంటలకు
వ్యవసాయ మార్కెట్..
● రాత్రి 1.15గంటలకు వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ధాన్యం దిగుమతి చేయడం కనిపించింది. ఎముకలు కొరికే చలిలో పనులు చేశారు. ఓ రైతు పరదాను ధాన్యంపై పరిచి శాలువాను కప్పుకొని పడుకున్నాడు.
ఉదయం 5గంటల తర్వాత
పారిశుద్ధ్య పనులు..
● ఉదయం 5గంటల తర్వాత చలిలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేశారు. చలిని సైతం లెక్కచేయకుండా పనులు చేశారు.
12:30గంటలకు
రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు..
● రాత్రి 12:30గంటలకు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి కనిపించింది. దుప్పట్లు కప్పుకొని కనిపించారు. చంటిపిల్లలతో వచ్చిన వారు చలినుంచి రక్షణ చర్యలు తీసుకున్నారు.
1:30గంటలకు
ఆర్టీసీ బస్టాండ్‌లో..
● ఆ సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లో 10మంది ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండడం కనిపించింది. వారు చలి నుంచి రక్షణకు సెంస్వెటర్లు ధరించారు. టవల్స్ కప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment