సీఎం కప్ క్రీడలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: సీఎం కప్ క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సీఎంకప్ క్రీడల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 19నుంచి 21వ తేదీ వరకు జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం భోజన వసతి, రవాణా తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వంతో పనిచేసి సీఎం కప్ క్రీడలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా క్రీడ ల అధికారి జ్యోతి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, మున్సిపల్ కమి షనర్ నోముల రవీందర్, డీఈ ఉపేందర్, మానుకోట తహసీల్దార్ భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment