నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు
గూడూరు: మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న మద్యం హోల్‌సేల్ దుకాణాన్ని వెంటనే సీజ్ చేయాలని బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, పట్టణ అధ్యక్షుడు చీదురు వెంకన్న డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక మద్యం దుకాణాలను యజమానులు కొనసాగిస్తున్నారని, మద్యం ప్రియులు అధిక ధరలు వెచ్చింది బెల్టు షాపులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు రహీం, సంపంగి రాములు, వెంకన్న, భూక్య సురేష్, భిక్షపతి, ఎల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment