సంక్షిప్త సమాచారం
సేవాలాల్ సేన జిల్లా ప్రచార
కార్యదర్శిగా నరేశ్
కురవి: సేవాలాల్ సేన జిల్లా ప్రచార కార్యదర్శిగా మండలంలోని నేరడ శివారు బాల్యతండా గ్రామానికి చెందిన భూక్య నరేశ్ నియమించినట్లు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవనాయక్ తెలిపారు.
దుప్పట్లు పంపిణీ
పెద్దవంగర: మండలంలోని రామచంద్రు తండాలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న చిక్కాల సతీష్ బుధవారం అదే గిరిజన తండాలో 20 మంది వృద్ధులకు దుప్పట్లు, విద్యార్థుకు క్రీడా సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బుదారపు శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్‌ం ఎర్రోజు విజయ్ కుమార్‌లు, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సోమారపు ఐలయ్య పాల్గొన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
నెల్లికుదురు: మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల కబడ్డీ కోచింగ్ క్యాంపును వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి ఎంఈఓ రాందాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సంద వీరన్న, ఉపాధ్యక్షుడు గందసిరి శ్రీనివాస్, తోట ఏకాంబ్రం, జాయింట్ సెక్రెటరీ గుమ్మల సురేందర్, పీఈటీ ఇమామ్ పాల్గొన్నారు.
సమాజసేవకు పాటుపడాలి
కేసముద్రం: ప్రతీ ఒక్కరు తమవంతుగా సమాజ సేవకు పాటుపడాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కేసముద్రంస్టేషన్ జెడ్పీహైస్కూల్‌లో తోడేటి వెంకన్న సహకారంతో రూ.15వేల విలువైన స్టడీమెటీరియల్‌ను పదో తరగతి విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మైస శ్రీనివాసులు, అప్పారావు, హెచ్‌ఎం బందెల రాజు పాల్గొన్నారు.
కరపత్రాల ఆవిష్కరణ
గంగారం: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర 9వ మహాసభలు డిసెంబర్ 22, 23న ఐటీడీఏ ఏటూరునాగారంలో జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సువర్ణపాక వెంకటరత్నం బుధవారం తెలిపాడు. తుడుందెబ్బ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.
మెడికల్ షాపుల తనిఖీ
కొత్తగూడ: మండల కేంద్రంలోని పలు మెడికల్ షాపులను డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉమారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంటి నంబర్లు ఇవ్వాలి
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇంటి నంబర్లు ఇవ్వాలని సీపీఎం నాయకుడు దొంతు సోమన్న, బానాల ఎల్లయ్య, రాజన్న డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం మరిపెడలోని ఇందిరానగర్ కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మల్లయ్య, రామస్వామి, ఎల్లమ్మ, జంపయ్య, శ్రీను, వెంకన్న పాల్గొన్నారు.
అందుబాటులో వరి విత్తనాలు
కురవి: సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని రైతువేదికలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని సీరోలు మండల వ్యవసాయాధికారి చాయారాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం విత్తనాలు 15కిలోల సంచి రూ.400, ఎంటీయూ1010 రకం విత్తనాలు 25కిలోల సంచి రూ.745లకు ఉన్నాయని తెలిపారు.
తప్పిపోయిన బాలుడి అప్పగింత
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న భూక్య కార్తీక్ పాఠశాల నుంచి బుధవారం తప్పిపోయి స్థానిక చికెన్ సెంటర్ ఉండగా చికెన్ సెంటర్ యజమాని 100కు డయల్ చేశాడు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుళల్ల ముజాఫర్, గణేశ్ చేరుకొని తండ్రి భూక్య మోహన్‌కు అప్పగించారు.
ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు
గార్ల: కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుల ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కోకన్వీనర్ సూర్యప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం గార్లలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సమావేశాల వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మనోజ్, తనీష్, వరుణ్, అఖిల, భార్గవి పాల్గొన్నారు.
పల్లె దవాఖాన తనిఖీ
పెద్దవంగర: పల్లె దవాఖానా సేవలనుప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి జ్వలిత కోరారు. బుధవారం మండలంలోని వడ్డెకొత్తపలల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను ఆమె సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు మానస, రాజ్‌కుమార్, ఎన్‌ఎం బూబా, ఆశలు, తదితరులు పాల్గొన్నారు.
అల్పాహార వితరణ
పెద్దవంగర: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం యూపీహెచ్‌సీ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మీరాజ్ సాకారంతో విద్యార్థులకు అల్పాహార వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఏదునూరి శ్రీనివాస్ రేణుక పాల్గొన్నారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో రూ.5లక్షలతో నిర్మాణం చేయనున్న సీసీ రోడ్డు పనులకు కౌన్సిలర్ మహ్మద్ ఫరీద్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మహ్మద్ ఫరీద్, నాగమల్లు, ఉప్పలయ్య, రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గణితంపై ఆసక్తి పెంపొందించుకోవాలి
తొర్రూరు: గణిత శాస్త్రంపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకోవాలని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య విద్యార్థులకు సూచించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, వైస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అనిల్‌కుమార్‌రెడ్డి, కొల్లూరు అశోక్ పాల్గొన్నారు.
నాల్గోరోజుకు చేరిన దీక్ష
కురవి: దళిత రైతు బేతమళ్ల సహాదేవ్ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్ష బుధవారం నాటికి నాల్గో రోజుకు చేరింది. దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కోటయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంమూర్తి, మాలోత్ కిషన్‌నాయక్, బీఆర్‌ఎస్ మండల కార్యదర్శి సాంబశివరావు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
కురవి: బయ్యారం గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి, మహబూబాబాద్‌కు చెందిన నిఖిల్ అనే వ్యక్తి, ఇద్దరు కలిసి బైక్‌పై మహబూబాబాద్ నుంచి బయ్యారం వైపునకు వెళ్తున్నారు. బయ్యారం నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం బంగారుగుడెంతండా వద్ద బైక్‌ను ఢీకొట్టడంతో ఇమ్రాన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment