రాష్ట్రస్థాయి విజేతలుగా నిలవాలి
మహబూబాబాద్ అర్బన్: సీఎం కప్ క్రీడల్లో జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సైతం విజేతలుగా నిలువాలని జిల్లా క్రీడల యువజన శాఖ అధికారిణి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. యువత, విద్యార్థులను క్రీడల్లో పోత్సహించేందుకు గ్రామీణ, మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో మెరిసిన క్రీడాకారులు జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు, కోచ్‌లు, వెంకటేశ్వ ర్లు, శంకర్‌నాయక్, పద్మావతి, పుష్పాలీల, శ్రీనివా స్, సునీత, వీరభద్రం, సింధువర్మ, శంకర్, నిర్మల, చాంప్లనాయక్, అరుణ, మాధవి, కాశీనాథ కుమారస్వామి, కమల్‌కిషోర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా యువజన క్రీడల
శాఖ అధికారి జ్యోతి
ముగిసిన సీఎం కప్ క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment