అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట
● విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు
● రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శన.. గుర్తింపు
● నేడు జాతీయ గణిత దినోత్సవం (రామానుజన్ జయంతి)
ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు ఇందుర్తి సాయిలేఖ్య. కంబాలపల్లి గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని గణితంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. కంబాలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ 2022 – 23 విద్యాసంవత్సరంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ పరీక్షకు హాజరై తృతీయ స్థానం సాధించింది. అదే ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10 జీపీఏ సాధించింది. మేథా ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికై రెండు సంవత్సరాలు ఉచిత విద్యనభ్యసిస్తుంది. ఇంటర్మీడియట్ (ఎంపీసీ)లో 468 మార్కులు సాధించింది. అదే విధంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వారి యంగ్ ఇండియా శాస్త్రవేత్త కార్యక్రమంలో పాల్గొంది. నాటి కలెక్టర్ శశాంకతో అభినందనలు అందుకుంది. – మహబూబాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment