కాంగ్రెస్ పాలనలోనే రైతులు సుభిక్షం
● ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పెద్దవంగర: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటారని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని పోచంపల్లి గ్రామంలో దేవాదుల భూనిర్వాసితులకు నిధులు మంజూరు కాగా శనివా రం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 250మంది రైతులు దేవాదుల ప్రాజెక్టు ద్వారా భూ నిర్వాసితులు కాగా ప్యాకేజీ ఆరు ద్వారా వారికి రూ.11.40 కోట్లు అందజేసినట్లు తెలిపారు. మండలంలోని అవుతాపురం, పోచంపల్లి, గంట్లకుంట చెరువులను గోదావరి జలాలతో నింపుతామని తెలిపారు. మండలంలోని భూ నిర్వాసితులైన 110మంది రైతులకు రూ.4.13లక్షలు అందాయని ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయక్ తెలిపారు. నిధుల పంపిణీలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏఎంసీ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, ఆర్డీఓ గణేష్, ఇరిగేషన్ ఈఈ సీతారాం నాయక్, డీఈ కిషన్ ప్రసాద్, ఏఈ కిశోర్, నాయకులు హమ్యా నాయక్, ముద్దసాని సురేష్, విజయ్‌పాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment