గణిత దినోత్సవం ఎలా వచ్చిందంటే..
సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం రోజు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.
గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహా సముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయ తీరాల్ని చేరవచ్చు. అదే తరహాలో అంకిత భావం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. చిన్న వయసులోనే చిటికె వేసినంత సులువుగా లెక్కలు చేస్తున్నారు. నేడు (ఆదివారం) రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం. ఈ నేపథ్యంలో గణితంలో ప్రతిభ కనబరుస్తున్న ఘనులపై, వారిని తయారు చేస్తున్న ఉపాధ్యాయులపై ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment