అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
కురవి: పదో తరగతి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని నేరడ గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి బాలికలకు ఎంఈఓ బాలాజీ, టీచర్ తోడేటి వెంకన్న సహకారంతో అందించిన స్టడీ మెటీరియల్‌ను డీఈఓ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు నాలుగు అంశాలను తప్పక పాటించాలన్నారు. వందశాతం హాజరు, చాప్టర్ పార్ట్ టెస్ట్ యూనిట్ వారీగా రాయడం, లిటిల్ టీచర్ లిటిల్ లీడర్ కాన్సెప్ట్ ప్రతి పాఠశాలలో నిర్వహించడం, ప్రతీ ఉపాధ్యాయుడు విషయాల వారీగా విద్యార్థుల అందరిని దత్తత తీసుకోవాలని తెలిపారు. ఈ మూడు నెలలు విద్యార్థులు గ్రూపు డిస్కస్ చేసుకోవాలని, ప్రతి చాప్టర్‌లో పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓ బాలాజీ, టీచర్ తోడేటి వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
చిన్నగూడూరు: పదో తరగతి విద్యార్థినులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం దాతల సాయంతో సేకరించిన స్టడీ మెటీరియల్‌ను పదో తరగతి విద్యార్థినులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓ రవికుమార్, టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment