అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కేసముద్రం/నెల్లికుదురు/గూడూరు: అన్నివర్గాల ప్రజల అభివద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాటుపడుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మంగళవారం కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లోని సీ్త్ర శక్తి భవన్, చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం, ధన్నసరి సోసైటీ వైస్ చైర్మన్లు అంబటి మహేందర్‌రెడ్డి, అల్లం నాగేశ్వర్‌రావు, బండారు వెంకన్న, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, ఇనుగుర్తి మండల అధ్యక్షుడు సతీష్, మార్కెట్ డైరెక్టర్ వోలం రమేశ్ పాల్గొన్నారు.
ఐక్యతతో ఉండాలి
నర్సింహులపేట/దంతాలపల్లి/మరిపెడ రూరల్: మానవత్వం లోపిస్తే గొడవలు, అల్లర్లు జరుగుతాయని, కాబట్టి ప్రతీ ఒక్కరు ఐక్యతతో ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రార్థన మందిరంలో మంగళవారం నర్సింహులపేట, చిన్నగూడురు మండలాలకు ప్రభుత్వం తరఫున నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ గణేష్, తహసీల్దార్లు నాగరాజు, మహబూబ్ అలీ, పాస్టర్లు ప్రభుచరణ్, సతీష్, రాజేష్, మోషే, సామ్యోల్, వీరన్న, కృపావరం పాల్గొన్నారు.
కురవి: మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ సునీల్‌రెడ్డి, ఎంపీడీఓ వీరబాబులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, నాయకులు అవిరె మోహన్‌రావు, ఎన్.రాజేందర్‌కుమా పాల్గొన్నారు. కాగా మరనాత టెంపుల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు.
డోర్నకల్: స్థానిక సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న కేక్ కట్ చేసి ఫాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కోటిలింగం, సీరోలు తహసీల్దార్ శారద, డీటీ వీరన్న, బిషప్ మల్చూర్‌నాయక్, పాస్టర్లు పాల్గొన్నారు.
బయ్యారం: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను జీసస్ హోమ్ వర్షిప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపతి కేక్ కట్ చేశారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment