రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
కురవి: మనువాదుల దాడి నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కురవిలోని సీపీఐ కార్యాలయంలో మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలనే అమిత్‌షా లాంటి వ్యక్తులు అంబేడ్కర్‌ను అవమానించే విధంగా ప్రవర్తించే మనువాదుల దాడిని తిప్పికొట్టాలన్నారు. సీపీఐ 99 ఏళ్ల ఆవిర్భావ ఉత్సవాలను ఈనెల 26న ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కరణం రాజన్న, నాయకులు బుర్ర సమ్మయ్య, తురక రమేష్, కన్నె వెంకన్న, రామ్మూర్తి, దూదికట్ల సారయ్య, ఉప్పలయ్య, వీరన్న పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
సుధాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment