అకాల వర్షంతో కల్లాల్లో తడిసిన ధాన్యం
గార్ల: మండలంలో మంగళవారం అకాల వర్షం కురువడడంతో కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకుంటూ ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిరుజల్లులతో రైతుల్లో ఆందోళన
బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కురిసిన చిరుజల్లులతో ధాన్యం రైతుల్లో ఆందోళన నెలకొంది. వానాకాలం సీజన్ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కురిసిన చిరుజల్లులతో ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో కాటాలు పెట్టిన ధాన్యం బస్తాలు లారీలు రాక మిల్లులకు తరలించకపోవటంతో తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment