హామీలను నెరవేర్చని ప్రభుత్వం
గార్ల: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడంతో, అనేక మంది ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిస్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి షరతులు విధించకుండా ధాన్యం కాంటాలు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి వెంకన్న, రమేష్, జనార్దన్, భిక్షమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment