వికటించిన హెర్బల్ మందు..
● చికిత్స పొందుతూ మహిళ మృతి
చెన్నారావుపేట: హెర్బల్ మందు వాడగా వికటించడంతో ఎంజీ ఎంలో చికిత్స పొందుతూ మ హిళ శుక్రవారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోజేర్వుకు చెందిన మిరాల మల్లయ్య, రాజమ్మ దంపతుల కూతురు యాదలక్ష్మి(40) భర్తతో విడిపోయి కుమారుడు వెంకటేశ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది. వై ద్యుల సలహా మేరకు అల్లోపతి వైద్యం పొందుతోంది. ఈ నెల 16వ తేదీన వరంగల్‌కు చెందిన క విత వద్ద రూ. 3 వేలు చెల్లించి హెర్బల్ మందు కొ నుగోలు చేసి మూడు రోజులు వాడింది. 19న అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబీకులు గమనించి ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యాదలక్ష్మి మృతితో కుమారుడు వెంకటేశ్ గుండెలవిసేలా రోదించాడు. తల్లి మృతితో ఒంటరయ్యాడు. మృతురాలి సోదరుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment