వరంగల్ బస్టాండ్ ఆధునికీకరణకు సుమారు నాలుగు దశాబ్దాల తరువాత ముహూర్తం కుదిరింది. 1984లో ఈ బస్టాండ్‌ను ప్రారంభించగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక హంగులతో నిర్మించతలపెట్టారు. ఈ మేరకు పాత బస్టాండ్‌ను కూల్చివేశారు. రైల్వేస్టేషన్ పక్కనే ఉండడంంతో నియో మెట్రో రైల్వేస్టేషన్ వచ్చేలానిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) సుమారు రూ.73.50 కోట్లతో ప్రాథమిక అంచనాలు రూపొందించి.. జీప్లస్5 భవనం చేపట్టాలని నిర్ణయించారు. భూగర్భంలో రెండు పార్కింగ్ కేంద్రాలు, ఆర్టీసీ కార్యాలయం, వాణిజ్య దుకాణాలు, బాంక్వెట్‌హాల్, మల్టీఫ్లెక్స్, హోటల్, రెస్టారెంట్ ఉండేలా రూ పొందించారు. ఒకేసారి 35 బస్సుల వరకు నిలిపి ఉంచేలా ఫ్లాట్‌ఫామ్‌లు డిజైన్ చేశారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. పూర్తయితే వరంగల్ పరిధి రూపురేఖలు మారిపోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment