పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ కృష్ణకిశోర్
నర్సింహులపేట: నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను శనివారం తొర్రూర్ డీఎస్పీ కృష్ట కిశోర్ శనివారం తనిఖీ చేశారు. పీఎస్ పరిసరాలు, రికార్డులు, ఆయుధాలను పరిశీలించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. మండలంలో శాంతిభద్రతలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పీఎస్ లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సీఐ జగదీశ్, ఎస్సై మాలోతు సురేశ్, ఏఎస్సైలు కె.వెంకన్న, వెంకన్న, హెచ్‌సీలు, పీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలి
నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించుకోవాలని వైద్యులు, వైద్యసిబ్బందికి డీఎంహెచ్‌ఓ మురళీధర్ సూ చించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రం, మండలంలోని నర్సింహులగూడెంలోని సబ్ సెంటర్‌ను శనివారం ఆయన తని ఖీ చేశారు. ఆస్పత్రిలోని హాజరు, ఓపీ, ఐపీ రిజిస్టర్లు, ఆస్పత్రిలో మెడిసిన్ నిల్వలను పరి శీలించారు. పీహెచ్‌సీలో నిర్వహించే కార్యకలా పాలను నిర్వహిస్తున్నారా.. లేదా.. అని అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.
మరిపెడ మున్సిపాలిటీ మేనేజర్‌గా శ్రీనివాస్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కూరపాటి శ్రీనివాస్‌కు మేనేజర్‌గా పదోన్నతి లభించింది. ఈమేరకు ఆయనను మరిపెడ మున్సిపాలిటీ మేనేజర్‌గా బదిలీ చేస్తూ సీడీఎంఏ టీ.కే.శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పా ల్గొని స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్య లో తరలివచ్చారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆలయ అర్చకులు రాజ శేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్‌లు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేక పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment